హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు. 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో జనసేన పార్టీకి మరింత బలమైన స్థానం కల్పించడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల సమస్యలపై దృష్టి సారించి ముందుకు సాగాలని సూచించారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
రానున్న రోజుల్లో జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు తెలంగాణ రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి.






